నిమ్మకాయలకు పుల్ డిమాండ్.. ఒకటి రూ.10

నిమ్మకాయలకు పుల్ డిమాండ్.. ఒకటి రూ.10

హైదరాబాద్, వెలుగు: సిటీలో నిమ్మకాయలకు ఫుల్ ​డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. కానీ అందుకు తగ్గట్టు దిగుమతి ఉండటం లేదు.  సమ్మర్​తో పాటు కరోనా ఎఫెక్ట్​ వల్ల  వాడకం పెరిగింది.  నిమ్మకాయలో ‘సి’ విటమిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుష్కలంగా ఉంటుంది. కరోనా కారణంగా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు  ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. గతంలో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క నిమ్మకాయ రూ.2 ఉండగా, ప్రస్తుతం రూ.5  నుంచి రూ.10 వరకు ధర ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిమ్మకాయల దిగుమతులు తగ్గడంతో కొరత ఏర్పడిందని నిమ్మకాయల వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిపడా దిగుమతి కాకపోవడంతో ధర పెరిగిందంటున్నారు. ఈనెలలోనే నిమ్మకాయ ధరలు ఇలా ఉంటే మేలో  మరింత ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.   

 కరోనాకు ముందు 100 టన్నులు 

గ్రేటర్​లో నిమ్మకాయల వినియోగం ప్రతిరోజు160 టన్నుల వరకు ఉంటుంది. కరోనాకు ముందు సమ్మర్​లో వంద టన్నుల వరకు అమ్మేవారు.  గతేడాది నుంచి  డిమాండ్​ పెరిగింది. ధరలు కూడా అదే విధంగా పెరిగాయి. ప్రస్తుతం రోజూ130 టన్నుల వరకు మాత్రమే దిగుమతి అవుతుంది.  మిగతావి రైతులు నేరుగా తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు.  
తగ్గిన దిగుమతులు..

సిటీకి నిమ్మకాయల దిగుమతులు చాలా వరకు తగ్గాయి. గతేడాది సమ్మర్​లో డైలీ 1500 బస్తాల వచ్చేవి. ప్రస్తుతం చాదర్​ఘాట్​నిమ్మకాల మార్కెట్​కి డైలీ వెయ్యి బస్తాలు మాత్రమే వస్తున్నాయి. ఒక్కో బస్తాలో 350 నుంచి 400 వరకు ఉంటాయి.  రాష్ర్టంలోని జిల్లాల నుంచే కాకుండా  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చేవి. ప్రస్తుతం ఎక్కడికక్కడే ఫుల్​ డిమాండ్​ఉండగా చాలా వరకు దిగుమతి తగ్గిపోయింది. 

రూ.2 వేలకుపైగానే బస్తా ధర..

చాదర్​ఘాట్​ హోల్​సేల్​ మార్కెట్​లో ఒక్క నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రెండు వేలకు పైగానే ఉంది. గతంలో వేయి రూపాయల కంటే తక్కువనే ఉండేది. డిమాండ్​ఎక్కువగా ఉండంతో మార్కెట్లో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. నిమ్మకాయల సోడా బండ్ల నుంచి హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల వారు కూడా హోల్​సేల్​ గానే కొనుగోలు చేస్తారు. దీంతో రోజురోజుకు బస్తాపై ధరలు పెరుగుతున్నాయి. 

దుకాణాల్లో​ నో స్టాక్​..

సాధారణంగా కూరగాయలు విక్రయించే కిరాణషాపుల్లో నిమ్మకాయలు అమ్ముతుంటారు. ప్రస్తుతం 20 షాపుల్లో ఒకరి వద్ద మాత్రమే లభిస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండడంతో మార్కెట్లలో కూడా అందరి వద్ద దొరకడం లేదు. ధరలు ఎక్కువగా ఉండడంతో తీసుకొచ్చాక అమ్ముడు పోకపోతే మిగిలిపోతాయని విక్రయించడంలేదని వ్యాపారులు చెబుతున్నారు.