ఆక్సిజన్ కు డిమాండ్ ఫుల్..ప్రొడక్షన్ డల్

ఆక్సిజన్ కు డిమాండ్ ఫుల్..ప్రొడక్షన్ డల్

రాష్ట్రంలో అవసరం 140 టన్నులు.. ఉత్పత్తి 80 టన్నులు
వైరస్ వ్యాప్తితో సిలిండర్లకు డిమాండ్
పదింతలు ఎక్కువగా ఆక్సిజన్
అడుగుతున్న ఆస్పత్రులు
ఇప్పటికే భారీగా పెరిగిన సిలిండర్ల ధరలు
జోరుగా కొనసాగుతున్నబ్లాక్ దందా
ఇట్లే ఉంటే ఇబ్బందులంటున్న ఎక్స్ పర్టులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే..మరోవైపు ఆక్సిజన్ సిలిండర్లకొరత వేధిస్తోంది. డిమాండ్ భారీగా ఉన్నా.. అందుకు తగినట్లుగా ప్రొడక్షన్ ఉండటం లేదు. గతంలో కంటే 10 రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ కావాలని హాస్పిటల్స్ కోరుతున్నాయి. ఇప్పటికే సిలిండర్లధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో మరో నెల రోజులు ఇదే పరిస్థితి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఎక్స్ పర్టులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆక్సిజన్ సిలిండర్లుబ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి.

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విలయ తాండవం చేస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు జిల్లాల్లో నూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓల్డేజ్ వారు, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు వైరస్ వల్ల త్వరగా చనిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువ మంది ఊపిరి అందకపోవడం వల్లే మరణిస్తున్నారు. చాలా మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. దీంతో జనం ముందు జాగ్రత్తగా ఆక్సిజన్‌ సిలిం డర్లు కొంటున్నా
రు. పేషెంట్స్ బంధువులు కూడా కొనుగోలు చేసి ఇంట్లోపెట్టుకుంటున్నారు. కొందరు డాకర్ట సూచన ్ల మేరకు రోగులకు ఆక్సిజన్‌ పెడుతున్నారు. మరికొందరు కరోనా టెన్షన్‌తో అవసరం ఉన్నా లేకున్నాసిలిండర్స్ కొని పెట్టుకుంటున్నారు. దీంతో వాటికి బాగా డిమాండ్ పెరిగింది.

ధరలు కూడా పెరిగినయ్

రాష్ట్రంలో ఉన్న రెండు ప్రైవేట్ ఎయిర్ ప్రొడక్ట్ కంపెనీలు 80 టన్నుల ఆక్సిజన్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రం లో 140 టన్నుల వరకు డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. హాస్పిటల్ మేనేజ్ మెంట్స్ కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కువగా కావాలని కోరుతున్నాయి. గతంలో కంటే 10 రెట్లు ఎక్కువగా ఆర్డ‌ర్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. గతంలో క్యూ బిక్ మీటర్ ఆక్సిజన్ కు రూ.10 ఉండగా, ఇప్పుడు అది 20కి పెరిగింది. కరోనా కేసుల తీవ్రత ఇలానే కొనసాగితే మరో 15 నుంచి 20 రోజుల్లో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి, ఇబ్బందులు తలెత్తవచ్చని ఎక్స్ పర్టులు హెచ్చరిస్తున్నారు.

జోరుగా బ్లాక్ దందా..
ఆక్సిజన్ కు డిమాండ్ పెరగడంతో కొందరు బ్లాక్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లభించే ఆక్సిజన్ సిలిండర్ల ధరను రూ.20 వేలకు పెంచేశారు. గతంలో రూ.100 తీసుకుని 10 కేజీల సిలిండర్ నింపేవారు. మరో వంద అదనంగా తీసుకుని 40 నుంచి 50 కేజీల సిలిండర్లనునింపేవారు. ఇప్పుడు నింపడానికే రూ.500 దాకా తీసుకుంటున్నారు. కాన్సన్ట్రేటెడ్ సిలిండర్ల ధరలు కూడా పెంచేశారు. గతంలో వీటి ధర రూ.40 వేలు ఉండగా, ఇప్పుడు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్షకు చేరుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం