గేట్లన్నీ ఓపెన్..భారీ వర్షాలతో గోదావరికి పోటెత్తిన వరద

గేట్లన్నీ ఓపెన్..భారీ వర్షాలతో గోదావరికి పోటెత్తిన వరద
  • కాళేశ్వరం నీళ్లు మళ్లీ సముద్రం బాట
  •  అన్నారం బ్యారేజీకి లిఫ్ట్ చేసిన 8 టీఎంసీలు కిందికి..
  •  మేడిగడ్డమొత్తం గేట్లెత్తడంతో దిగువకు లక్షల క్యూసెక్కుల వరద
  •  రెండు రోజుల్లోనే వెళ్లిపోయిన 180 టీఎంసీలు
  •  మానేరులో వరద.. ఎల్‌‌ఎండీకి భారీగాఇన్‌‌ ఫ్లో
  • నేడే రేపో మిడ్ మానేర్ గేట్లు ఎత్తే చాన్స్
  • దీనికి ఎల్లంపల్లి నుంచి పంప్చేసిన 12 టీఎంసీలు వృథ

 

ఎడతెరిపి లేని వానలతో గోదావరిలో వరద పెరిగింది. ప్రాణహిత పోటెత్తుతోంది. ఎగువన అన్నారం బ్యారేజీ మానేరు వరదతో నిండిపో యింది. వాగులు, వంకలతో మిడ్ మానేరు ఫుల్ అయింది. రిజర్వాయర్లు, బ్యారేజీల గేట్లన్నీ ఓపెన్ చేశారు. దీంతో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ గేట్లన్నీ ఓపెన్ చేసి ఉంచగా తాజాగా అన్నారం బ్యారేజీ గేట్లుఎత్తారు. మేడిగడ్డ నుంచి దీనికి ఎత్తి పోసిన నీళ్లు.. మళ్లీ మేడిగడ్డకు, అక్కడి నుంచి కిందికి పోతున్నాయి. ఇక సోమవారం మిడ్ మానేరుగేట్లుఎత్తే చాన్స్ఉంది. రెండు వారాలుగా కాళేశ్వరంలింక్–2లో భాగంగా ఎల్లంపల్లినుంచి మిడ్మానేరుకు నీటిని పంపింగ్ చేశారు.

శుక్రవారం దాకా నందిమేడారం, లక్ష్మీపూర్‌ మోటార్ల ను రన్చేసి.. 12 టీఎంసీలను తరలించారు. అయితే ఇప్పుడు వాగులు, వంకల ద్వారా మిడ్‌‌ మానేరులోకి ఇన్ఫ్లోబాగా పెరిగింది. అటు పంపింగ్నీళ్లు, ఇటు వరదతో మిడ్మానేరు ఫుల్ అయింది. 25 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రానికి 20.5 టీఎంసీల స్టోరేజీ ఉంది. ఇంకా ఇరవై వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుండటంతో సోమవారం గేట్లు ఎత్తే చాన్స్ ఉందని ఇంజనీర్లు చెప్తున్నారు. దిగువన ఉన్న ఎల్ఎండీ రిజర్వాయర్ ఇప్పటికే నిండుగా నీటితో కళకళలాడుతోంది. మిడ్ మానేరు గేట్లు ఎత్తితే దిగువన ఉన్న ఎల్ఎండీ గేట్లు ఎత్తక తప్పదని అంచనా వేస్తున్నారు.

రెండో ఏడాది కూడా కలిసిరాలే!

ఏటా 225 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేసి అర కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రెండో ఏడాది కూడా నిరుపయోగంగా మారింది. తొలి ఏడాది ఎత్తిపోసిన నీళ్లన్నింటినీ ఎల్లంపల్లికి వరద పోటెత్తటంతో కిందికి వదిలేయాల్సి  వచ్చింది. ఈసారి కూడా అదే సీన్ రిపీటైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గత ఇరవై రోజుల్లో 17 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేశారు. అటు మంథని సమీపంలో మానేరు వాగు పోటెత్తడంతో అన్నారం ఎగువన ఇన్ ఫ్లోపెరిగింది. అన్నారం బ్యారేజీ ఫుల్అవటంతో గేట్లు ఓపెన్చేశారు. అప్పటివరకు ఎత్తిపోసిన కాళేశ్వరం నీళ్లు కిందికి వెళ్ళిపోయాయి.

లేటుగా లిఫ్ట్ చేసినా అంతకంతే..

నిరుటి చేదు అనుభవంతో ఈ సారి కాళేశ్వరం మోటార్లు ఆలస్యంగా ఆన్చేసినా అదే పరిస్థితి రిపీటైంది. జూన్‌ నుంచి వానాకాలం సీజన్‌ మొదలైంది. రెండు నెలల తర్వాత ఆగస్టు 3న అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు‌‌ మోటార్లను ప్రారంభించారు. అప్పటిదాకా ప్రాణహిత నుంచి వచ్చిన వరద నంతా మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి విడిచిపెట్టారు. ఆగస్టు 5న మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం (సరస్వతి), సుందిళ్ల(పార్వతి) పంపుహౌస్‌ల వద్ద ఏకకాలంలో మోటార్లను నడిపారు. మేడిగడ్డ నుంచి అన్నారానికి 8 టీఎంసీలు, అక్కడినుంచి సుందిళ్లకు 18, ఎల్లంపల్లి రిజర్వాయర్‌‌‌‌లోకి 17 టీఎంసీలు లిఫ్ట్‌‌‌‌చేశారు. భారీగా కరెంటు ఖర్చు చేసి లిఫ్ట్ చేసిన ఈ నీళ్లన్నింటినీ మళ్లీ వదిలి పెట్టాల్సి రావటంతో ఇరిగేషన్ ఇంజనీర్లు తల పట్టుకుంటున్నారు. మేడిగడ్డ(లక్ష్మి పంపుహౌస్‌) వద్ద ఈ నెల 10వ తేదీ నుంచి మోటార్లు బంద్‌ చేశారు. మూడురోజుల కింద అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ ల మోటార్లను ఆపేశారు. మూడు రోజులుగా అన్నారం గేట్లు తెరిచి దాదాపు 50 టీఎంసీల నీళ్లను మేడిగడ్డకు విడుదల చేశారు. ఆదివారం 18 గేట్లను తెరిచి 1.37 లక్షల క్యుసెక్కుల నీటిని రిలీజ్ చేస్తు న్నట్టు అధికారులు ప్రకటించారు. ఇంతకాలం లిఫ్ట్‌‌‌‌ చేసిన నీళ్లు మళ్ వలీ ృథా అయ్యాయి.

మేడిగడ్డ నుంచి వందల టీఎంసీలు పోతున్నయ్

నెలరోజులుగా గోదావరి ఉప నదులైన మానేరు,ప్రాణహిత నుంచి వరద కొనసాగుతోంది. దీంతో వానాకాలం మొదలైనప్పటి నుంచి మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసే ఉంచారు. నెలరోజుల్లో 400 టీఎంసీల నీళ్లు ఇక్కడనుంచి కిందికి వదిలేశారు. 2 రోజులుగా మేడిగడ్డనుంచి 9 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకుపోతోందని ఇంజనీర్లు అంచనా వేశారు.అంటే రెండురోజుల్లోనే ఇక్కడినుంచి 180 టీఎంసీల నీళ్లు వెళ్లిపోయాయి. ఆదివారం సాయంత్రం మేడిగడ్డవద్ద 65 గేట్లు తెరిచి ఉండగా 9.87లక్షల క్యుసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.