స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేసినప్పటికీ రిటైల్ మార్కెట్లో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఇవాళ తిరిగి ఊపందుకున్నాయి. ఒక్క రాత్రిలోపే ఊహించని స్థాయిలో గోల్డ్ అండ్ సిల్వర్ పెరగటం ఆందోళన కలిగిస్తోంది భారతీయ ప్రజలకు. ఇది చూస్తుంటే ఈ ఏడాది సామాన్య మధ్యతరగతి ప్రజలు విలువైన లోహాలను కలలో కూడా కొంటాం అనుకునేలా కనిపించటం లేదు. నేడు షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ ప్రాంతంలో రేట్లను వెంటనే పరిశీలించండి.
జనవరి 23న బంగారం రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 22 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.540 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 971గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 640గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే బంగారం కంటే రోజురోజుకూ దూకుడుగా పెరుగుతూ పోతోంది. ఒక్క రోజులోనే కేజీకి రూ.15వేలు రిటైల్ మార్కెట్లో పెరగటంతో రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే శుక్రవారం జనవరి 23, 2025న వెండి రేటు కేజీకి రూ.15వేలు పెరిగింది దేశీయంగా. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.360 వద్ద ఉంది.
