Chiranjeevi: మెగాస్టార్ సరసన ప్రియమణి.. బాబీ మ్యాజిక్ ప్లాన్ రిపీట్ అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ సరసన ప్రియమణి.. బాబీ మ్యాజిక్ ప్లాన్ రిపీట్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ' మన శంకర్‌వరప్రసాద్ గారు' మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. మరో వైపు బాబీ కొల్లి డైరెక్షన్ లో రాబోతున్న ' మెగా 158' ( వర్కింగ్ లైటిల్ ) సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంపై కొన్ని రోజులుగా సినీ సర్కిల్ లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

చిరు భార్యగా ప్రియమణి?

లేటెస్ట్ గా చిరు భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.ఆమె ఎంపిక దాదాపు ఖరారైట్లు తెలుస్తోంది.  ఒకవేళ ఇదే నిజమైతే, మెగాస్టార్ సరసన ప్రియమణికి ఇది ఒక నుంచి చాన్స్ గా మారుతుంది. మరోవైపు ఇప్పటికీ కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతి శెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే నీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మరో బ్లాక్ బస్టర్ రెడీ..

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం కానుండగా.. మార్చి 2026 నుంచి చిరంజీవి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

►ALSO READ | Renu Desai: "అంతా నాశనమైపోతుంది".. కుక్కల దాడి ఇష్యూలో 'కల్కి' సినిమాను లాగిన రేణు దేశాయ్!

ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా కీలకపాత్రలో కన్పించబోతున్నారని సమాచారం.  మరో వైపు సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ' విశ్వంభర' రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నాని నిర్మాణంలో 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో మాస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు చిరు. ఇందులో పాత్రల రూపకల్పన చాలా బలంగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.