రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్

రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలకు సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్  ప్రకటించింది. కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తే ప్రమాదం ఉందని పోలీస్ అధికారులకు సూచించింది. ఆయా రాష్ట్రాల సి ఎస్, డీజీపీ లు  గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

అదే విధంగా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద , కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని ఆదేశించింది.కౌంటింగ్ కు ఆటంకాలు కల్పించే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా కొందరు రాజకీయ నేతలు ప్రకటనలు చేస్తున్నారని, ఈ క్రమంలో గట్టి భద్రతా చర్యలను చేపట్టాలని కేంద్ర హోం శాఖ తెలిపింది