‘రూసా’ నిధులు ల్యాప్స్​ కాకుండా చూడాలె : గవర్నర్​ తమిళిసై

‘రూసా’ నిధులు ల్యాప్స్​ కాకుండా చూడాలె : గవర్నర్​ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అందించే రూసా(రాష్ట్రీయ ఉచ్ఛతర్ ​శిక్షా అభియాన్​) నిధులు ల్యాప్స్​ కాకుండా సద్వినియోగం చేసుకునేందుకు సరైన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీల వైస్​చాన్సలర్​లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఆదేశించారు. రూసా నిధులకు ఎంపికైన జేఎన్​టీయూ, ఉస్మానియా, పొట్టి శ్రీరాములు, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల వీసీలతో రాజ్ భవన్​లో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు.

రూసా నిబంధనల ప్రకారం మ్యాచింగ్ గ్రాంట్ పొందేందుకు వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్​విడుదల కాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూసా నిధులు ల్యాప్స్​అయ్యే అవకాశం ఉందని సమాచారం అందిన నేపథ్యంలో గవర్నర్ ఈ మేరకు వీసీలకు ఆదేశాలు ఇచ్చారు.