ఇక మిగిలింది శవాలకేనా.. ఇప్పుడు డబ్బాలకూ పింక్ కలర్

ఇక మిగిలింది శవాలకేనా.. ఇప్పుడు డబ్బాలకూ పింక్ కలర్

ప్రపంచవ్యాప్తంగా రోజుకొక ట్రెండ్ హల్ చల్ చేస్తుంది.  ఎవరో ఏదో చేశారని జనాలు కూడా అదే బాట పడుతున్నారు.  జనాలపై సినిమాల ప్రభావం ఎంతగా ఉందంటే  తమకు నచ్చిన హీరో.. హీరోయిన్ ఏ డ్రస్ వేసుకుంటే అదే కలర్ లో ఆ రకంగానే డ్రస్ కుట్టించుకుంటున్నారు.  ఇక ఇప్పుడు బార్బీ సినిమాలో పింక్ కలర్ ట్రెండ్ ఎంతగా ప్రచారం పొందిందంటే చివరకు శవాల డబ్బాలకు పింక్ కలర్ వేస్తున్నారు.  

ప్రపంచ వ్యాప్తంగా బార్చి ట్రెండ్ కొనసాగుతుంది.  అంత్యక్రియలకు ఉపయోగించే శవపేటికలకు గులాబీ రంగును వాడుతున్నారు. బార్బీ చిత్రంలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్‌కిన్నన్, సిము లియు, ఇస్సా రే, అమెరికా ఫెర్రెరా మరియు విల్ ఫెర్రెల్ వంటి స్టార్-స్టడెడ్ తారాగణం ఉంది. ఇది జూలై 21, 2023న థియేటర్లలో విడుదలైంది. బార్బీ సినిమాలో  శవపేటిక డిజైన్‌లపై నెటిజన్లు స్పందించారు. కొంతమంది .. విచిత్రంగా ఉందంటూ ..   అత్యుత్తమ చిత్రంగా  గుర్తించారు.  మరి కొంతమంది జస్ట్ స్టాప్ ఇట్ అని కామెంట్ పెట్టారు.  బార్బీ  చిత్ర దర్శకురాలు గ్రెటా గెర్విగ్..  ఈ చిత్రం కోసం కలలు కనే సెట్‌లను రూపొందించడంతో  ప్రపంచవ్యాప్తంగా పింక్ కలర్‌ కు గిరాకీ ఏర్పడిందని పేర్కొన్నారు.  తనను తాను స్టైలైజ్ చేసుకోవడానికి బార్బీ ధరించే హాట్ పింక్ కలర్‌తో ట్రెండ్‌ని సెట్ చేస్తూ, అభిమానులు పింక్ రంగులో చిత్రాన్ని వీక్షించారు. సినిమా థియేటర్లలో చాలా మంది  సినిమా క్యారెక్టర్‌లా దుస్తులు ధరించారు.

ర్గోట్ రాబీ మరియు ర్యాన్ గోస్లింగ్ నటించిన బార్బీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా మూటగట్టుకుంది.  బార్బీకోర్ ట్రెండ్ ను ప్రజలు అనుకరిస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా బార్బీ రంగుల ట్రెండ్ కొనసాగుతుంది. గులాబీ రంగు  క్రేజ్ ఎంతగా పెరిగిదంటే శవపేటికలను కూడా గులాబీరంగుతోనే తయారు చేస్తున్నారు. ఒలివారెస్ ఫ్యూనరల్ హోమ్ బార్బీ - శవపేటికలను తయారు చేసింది.    మీరు బార్బీలా విశ్రాంతి తీసుకోవచ్చు  అనే  నినాదంతో గులాబీ శవపేటికలను ప్రచారం చేసింది.

ఒలివారెస్ ఫ్యూనరల్ హోమ్  గులాబీ రంగుతో ఉన్న శవపేటికల  వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్  చేసింది, మెక్సికో, ఎల్ సాల్వడార్ మరియు లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలలో ని శవపేటికలు వివిధ రంగులతో ఉన్నారు.  కాని ఒలివారెస్ ఫ్యూనరల్ హోమ్ వారు  గులాబీ శవపేటికలలో వీడ్కోలు పలికే అవకాశాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అండర్‌టేకర్ ఐజాక్ విల్లెగాస్ నిర్వహించే ఎల్ సాల్వడార్‌లోని అహుచాపాన్‌లోని ఆల్ఫా,  ఒమేగా ఫ్యూనరల్ హోమ్ లలో ఏడాది నుంచి  ఈ గులాబీ శవపేటికలను అందజేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, విల్లెగాస్  ఈ ప్రత్యేక శవపేటికలపై 30 శాతం తగ్గింపును అందించాలని నిర్ణయించింది. వీటికి అధిక డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు బార్బీకోర్ ట్రెండ్‌ను స్వీకరిస్తున్నారు బార్బీ-  పింక్ రంగు దుస్తులను ధరించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమ చిత్రాలను పోస్టు చేస్తున్నారు, సినిమా గురించి చెప్పాలంటే, బార్బీ స్టార్-స్టడెడ్ తారాగణాన్ని కలిగి ఉంది, ఇందులో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్‌కిన్నన్, సిము లియు, ఇస్సా రే, అమెరికా ఫెర్రెరా మరియు విల్ ఫెర్రెల్ ఉన్నారు. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.