రేవంత్ అట్లనేది లేకుండే.. : జగ్గారెడ్డి

రేవంత్ అట్లనేది లేకుండే.. : జగ్గారెడ్డి

అసెంబ్లీలో ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ప్రగతి భవన్ ను కూల్చేస్తాం, పేల్చేస్తామని అనొద్దని  మీ లీడర్ రేవంత్ రెడ్డికి చెపొచ్చు కదా అని జీవన్ రెడ్డి జగ్గారెడ్డితో అన్నారు.  దీనిపై స్పందించిన జగ్గారెడ్డి.. ప్రగతి భవన్ కూల్చేస్తాం అనేది కాంగ్రెస్ విధానం కాదని చెప్పారు. అది ఉగ్రవాదులు, నక్సలైట్ల భాష అని అన్నారు. తమ పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకమన్నారు. నిజానికి రేవంత్ అలా మాట్లాడాల్సి ఉండేది కాదని జగ్గారెడ్డి అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రి హరీష్ రావును కలిసినట్టుగా  స్పష్టం చేశారు.