
- 40 % డిస్కౌంట్.. ఆర్డరిస్తే పది రోజుల్లో ఐటమ్స్
- పరిగిలో ‘ఫర్నీచర్షాప్’ భారీ మోసం
- వందల సంఖ్యలో బాధితులు
పరిగి, వెలుగు: డిస్కౌంట్ ధరకు ఫర్నీచర్ సప్లై చేస్తామంటూ రూ. కోటికి పైగా వసూలు చేసి ఉడాయించిన ఘటన వికారాబాద్‌జిల్లా పరిగిలో జరిగింది. తమిళనాడుకు చెందిన తాజొద్దీన్, మరో ముగ్గురు కలసి పరిగిలో నెల క్రితం హైవే పక్కన రోజా ట్రేడర్స్ఫర్నీచర్అండ్ఎలక్ట్రానిక్ దుకాణం ఓపెన్ చేశారు. దుకాణంలో బీరువాలు, మంచాలు, సోఫాసెట్లు, డైనింగ్టేబుల్స్, కుర్చీలు, ఫ్రిజ్ లు, కూలర్లు, ఫ్యాన్లు ఇలా అన్నీ అమ్ముతామంటూ శాంపిల్ఐటమ్స్ప్రదర్శనకు పెట్టారు. అసలు ధరలో 40 శాతం డిస్కౌంట్ఇస్తున్నామంటూ ప్రచారం చేశారు. 40 శాతం డిస్కౌంట్పోగా మిగిలిన మొత్తంలో సగం డబ్బులు కట్టి నచ్చిన ఐటమ్ఆర్డర్చేస్తే పది రోజుల్లో తెచ్చి ఇస్తామంటూ నమ్మబలికారు. ఇలా మొదటిసారి ఆర్డర్‌ఇచ్చిన ఒకరిద్దరికి తెచ్చిఇచ్చారు. దీంతో వందల సంఖ్యలో ప్రజలు ఆర్డర్లు ఇచ్చారు.
ఒక్కొక్కరి దగ్గర రూ. 4 వేల నుంచి రూ. 80 వేల వరకు అడ్వాన్సులు తీసుకున్నారు. మంగళవారం ఉదయం డెలివరీ అందాల్సినవారు దుకాణానికి వచ్చి చూస్తే మూసి ఉంది. ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనోటా ఈ నోటా రోజా ట్రేడర్స్దుకాణం వారు బిచాణ ఎత్తేశారని తెలియడంతో బాధితులు వందల సంఖ్యలో అక్కడకు చేరున్నారు. పెళ్లిళ్ల కోసం కూడా ఐటమ్స్ బుక్ చేశామంటూ చాలామంది బాధితులు వాపోయారు. పరిగి సీఐ మొగులయ్య, ఎస్సై వెంకటేశ్వరులు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణ యజమానులకు ఫోన్చేయగ ఎత్తలేదు. కాసేపటికి స్విచ్ఆఫ్చేశారు. బాధితులు ఇచ్చిన ఆర్డర్ఫారాలను జిరాక్స్తీసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు బాధితులు బారులు తీరారు. పరిగితోపాటు దోమ, పూడూరు, కుల్కచర్ల, వికారాబాద్ప్రాంతాల వారి నుంచి సుమారు కోటి రూపాయలకు పైగా వసూలు చేసి ఉడాయించినట్లు అంచనా వేస్తున్నారు.
రూ. 63,200 కట్టా
రాయల్ సోఫాసెట్, వుడ్అండ్గ్లాస్టేబుల్, ఆరు కుర్చీలతో డైనింగ్టేబుల్, ఎంఐ స్మార్ట్ఎల్ఈడీ టీవీ, రాయల్బెడ్స్, జీబ్రానిక్ హోం థియేటర్, లాంగ్ టేబుల్ఈ ఏడు ఐటమ్స్కోసం రూ.63,200 ఇచ్చి బుక్ చేశా. బుక్ చేసిన మూడు రోజులకే దుకాణం ఎత్తేశారు.– యాదయ్య, బాధితుడు, -పరిగి
బాధితులకు న్యాయం చేస్తాం
రోజా ట్రేడర్స్‌లో ఆర్డర్ చేసి తాము తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు మాకు ఫిర్యాదు చేశారు. చాలా మంది ఆర్డర్లు చేసినట్లు తెలుస్తోంది. దుకాణ యజమాని తాజొద్దీన్ఆధార్కార్డుపై తమిళనాడు అడ్రస్ఉంది. త్వరలో వారిని పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తాం. ఇలా తక్కువ డబ్బులకు ఆర్డర్‌పై ఇస్తామంటూ నమ్మి మోసపోవద్దు. – సీఐ మొగులయ్య