తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు .. ఎమ్మెల్యే వివేక్​ అండగా ఉంటాడు : జి.చెన్నయ్య

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు .. ఎమ్మెల్యే వివేక్​ అండగా ఉంటాడు : జి.చెన్నయ్య
  • మంత్రి వర్గంలో చోటు కల్పించాలి

జూబ్లీహిల్స్, వెలుగు: చెన్నూరు గడ్డం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం బంజారాహిల్స్​లోని సంఘం హెడ్డాఫీసులో జేఏసీ వర్కింగ్ చైర్మన్లు గోపోజు రమేశ్, మన్నె శ్రీధర్ తో కలిసి చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వివేక్​ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్​జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సీఎం రేవంత్​రెడ్డిని కోరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండే వివేక్ ను మంత్రిని చేస్తే ఆయా వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ కుమార్, పంజాగుట్ట విగ్రహ కమిటీ అధ్యక్షుడు భానుప్రకాశ్, మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గోకుల్ కల్యాణ్, డాక్టర్ కుమార్, ఎల్ల స్వామి, గణేశ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.