ఎల్‌‌వీఎస్‌‌ ర్యాపిడ్‌‌ చెస్‌‌ చాంపియన్‌‌గా రవి కృష్ణ

ఎల్‌‌వీఎస్‌‌ ర్యాపిడ్‌‌ చెస్‌‌ చాంపియన్‌‌గా  రవి కృష్ణ

హైదరాబాద్: మణికొండలోని ఎల్‌‌వీఎస్ చెస్ అకాడమీలో జరిగిన ర్యాపిడ్ చెస్ టోర్నీలో హైదరాబాద్‌‌కు చెందిన జి. రవి కృష్ణ చాంపియన్‌‌గా నిలిచాడు. ఆరు రౌండ్లలో రవి కృష్ణ 5.5 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచాడు. ఆకుల ప్రణయ్‌‌ కూడా ఐదున్నర పాయింట్లతో నిలిచినా మెరుగైన టైబ్రేక్‌‌ స్కోరు ఆధారంగా రవిని చాంపియన్‌‌గా ప్రకటించారు. సూర్య అఖిల్‌‌ మూడో ప్లేస్‌‌ను సొంతం చేసుకున్నాడు. 

బాలుర అండర్‌‌–9లో జితిన్‌‌ యలవర్తి, బాలికల్లో వర్షిణి కంబోజి, లౌక్య ఆశిష్‌‌, బాలుర అండర్‌‌–11లో తనీష్‌‌ ఈకుల, సిద్ధార్థ కార్తీక్‌‌, బాలికల అండర్‌‌–11లో శ్రీ వర్షిణి తన్మయ తాడినాడ, సాధ్వి స్వామి, బాలురు అండర్‌‌–13లో వై. శివకుమార్‌‌, ఉజ్లవ్‌‌ మేకల విజేతలుగా నిలిచారు.