రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ : జి.శంకర్

రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ : జి.శంకర్
  • వ్యతిరేకంగా 18న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
  • బీఆర్ ​అంబేద్కర్ ​నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్​

ఖైరతాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్​రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని, దాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల18న ఇందిరాపార్కు ధర్నా చౌక్​వద్ద మహాధర్నా చేపడుతున్నట్టు డాక్టర్​బీఆర్​అంబేద్కర్​నేషనల్ ఎస్సీ,ఎస్టీ ఫెడరేషన్​నేషనల్​చీఫ్​సెక్రటరీ జనరల్​ ఎం.నర్సింగరావు, నేషనల్​సెక్రటరీ జి.శంకర్​తెలిపారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​శుక్రవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించి, దేశాన్ని కాపోడుకోవడమే ముఖ్య ఉద్ధేశమన్నారు. ముఖ్యంగా ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్​విధానాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. ఓబీసీ, బీసీ, మైనార్టీలకు పొలిటికల్​రిజర్వేషన్​కల్పించాలని, అట్రాసిటీ యాక్టును కట్టుదిట్టంగా అమలుచేయాలని, దాడికి పాల్పడిన వారికి ముందస్తు బెయిలు ఇవ్వద్దన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ శాఖ అధ్యక్షుడు టి.రాజలింగం, ఎస్​ఎస్. తన్వీర్, పి.వీరాస్వామి, కల్పన పాల్గొన్నారు.