G20 సమ్మిట్: జానపద కళాకారులతో స్టెప్పులేసిన IMF చీఫ్ క్రిస్టాలినా

G20 సమ్మిట్: జానపద కళాకారులతో స్టెప్పులేసిన IMF చీఫ్ క్రిస్టాలినా

G20 సమ్మిట్ సమావేశాల్లో పాల్గొనేందుకు IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా ఇండియకు వచ్చారు.ఇవాళ(2023 సెప్టెంబర్8న) ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. క్రిస్టాలినాకు నృత్య ప్రదర్శనలతో జానపద కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. ఐఎంఎఫ్ చీఫ్ కూడా కళాకారులతో కలిసి స్టెప్పులేశారు. అద్భుతమైన కళా ప్రదర్శనకు కళాకారులను ఐఎంఎఫ్ చీప్ మెచ్చుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో క్రిస్టాలినా స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వాతావరణంలో మార్పులు, రష్యా, ఉక్రెయిన్ యుద్దం వంటి ప్రపంచ సమస్యలు ఉన్నప్పటికీ భారత్.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతం వృద్దిని సాధిస్తుందని IMF అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక ఆందోళనలు ఉన్నప్పటికీ భారత్.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. ఇది 2023--24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-----జూన్) 7.8 శాతం స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటును చూసింది. చైనా ఆర్థిక వ్యవస్థ 2023 రెండవ త్రైమాసికంలో సంవత్సరానికి 6.3 శాతం పెరిగింది.