సుస్థిర పాలన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే సాధ్యం : గడ్డం రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

సుస్థిర పాలన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే సాధ్యం : గడ్డం రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

గండిపేట, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన విజయం లోక్​సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని, సుస్థిర పాలన కాంగ్రెస్​తోనే సాధ్యమని ఆ పార్టీ  చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. బండ్లగూడ జాగీర్ ​మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదర్షాకోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్​లో రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూనే, ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యిందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందన్నారు. అందుకే ప్రజలు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తుగాగా ఓడించి, చెత్తబుట్టలో వేశారని విమర్శించారు. రేవంత్​పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని, తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుందన్నారు.

ఈ నెల18న నార్సింగి మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవిశ్వాస తీర్మానం ఉందని, అక్కడ కూడా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గనుందన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెలకొన్న ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు. హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీటిని అందుబాటులోకి తెస్తామని, నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మే 13న చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డైయిరీ పరిశ్రమ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్ఞానేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముదిరాజ్, మణికొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కస్తూరి నరేందర్, బండ్లగూడ జాగీరు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.