
బషీర్‌బాగ్, వెలుగు: ప్రజా యుద్ధ నౌక గద్దర్ అమరత్వం, ఆయన సాహిత్య, సాంస్కృతిక విశిష్టత, కృషిని తెలుపుతూ పాటలు, కవిత్వం, వ్యాసాలను ఆహ్వానిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జి.వి.సూర్యకిరణ్ బుధవారం ప్రకటించారు. రచనలన్నింటినీ ప్రచురించి పుస్తకం రూపంలో తీసుకురానున్నట్లు తెలిపారు. పాటలు, కవితలు ఇంతకు ముందు ప్రచురితమైనా పర్వాలేదన్నారు. యూట్యూబ్ చానల్ లో ఉన్న పాటలను రచయితల అనుమతితో ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.
రచనలు, పాటలను 7396065999 , 9000741188 నంబర్లకు వాట్సాప్‌లో గానీ, info@gaddarfoundation.org కు గానీ పంప వచ్చన్నారు. లేదంటే నేరుగా ప్లాట్ నెంబర్: 26, ఇంటి నెంబర్: 23/126/1/ఎ, నల్ల పోచారం టెంపుల్, భూదేవి నగర్ కాలనీ, సికింద్రాబాద్- 500015 అడ్రస్‌కు పోస్ట్ చేయాలని సూచించారు.