భూదాన్ పోచంపల్లి, వెలుగు: త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటి కేంద్రంలో కట్కూరి నరసింహ, వల్లాల కల్పన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తిచేసుకుని గృహ ప్రవేశాలు నిర్వహించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తడక వెంకటేశ్వర్లు. వైస్ చైర్మన్ రజిని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
