
తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తమ పార్టీ మెజారితోనే గెలిచామని.. ఎంఐఎం మద్దతు తెలిపింది తాను చూడలేదన్నారు. ఒకవేళ మద్దతు తెలిపితే ఎంఐఎంకి ధన్యవాదాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ గా ఎన్నిక అయ్యాక తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. మేయర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐదేళ్లు కార్పొరేటర్ గా పని చేశానని.. మహిళల రక్షణ- హెల్త్ సెంటర్స్ పై మరింత దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ సేవలు పేదలకు మరింత అందేలా చేస్తామన్నారు.
see more news
మిస్ ఇండియాగా తెలంగాణ యువతి
దిశ కేసులో కొత్త ట్విస్ట్.. లారీ ఓనర్ పై అనుమానాలు
సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగిన చిట్యాల సీఐ