జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులు, వాటి కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల అనుకూల స్థితి వల్ల కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. సుదీర్ఘ కాలం తర్వాత కర్కాటక రాశిలో 2026 అక్టోబర్ 4 వ తేది సాయంత్రం సుమారు 6గంటల31 నిమిషాలకు అక్కడే ఉన్న కర్కాటకరాశిలోకి చంద్రుడు ప్రవేశించడంతో అక్కడే ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచనున్నాడు. దీని ప్రభావం వలన నాలుగు రాశుల వారి ఇళ్లలో ధన వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
మేష రాశి : మేష రాశి వారికి గజకేసరి రాజయోగం వలన పట్టింది బంగారమే కానుంది. ఈ సమయంలో మంచి జీవితాన్ని ఇస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అప్పుగా ఇచ్చి నిలిచిపోయిన డబ్బు వారికి చేతికి తిరిగి వస్తుంది. గత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల వంటివి కనిపిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ యోగం సుఖస్థానంలో ఏర్పడుతోంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. తల్లి వైపు నుండి శుభవార్త వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
మిథున రాశి : గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి ధనయోగం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తోంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది.జీవితంలో అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి. స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ప్రాజెక్ట్లు చేపడతారు.సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుందని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : ఇదే రాశిలో గజకేసరి యోగం ఏర్పటడం వలన ఈ రాశి వారికి స్వర్ణయుగం ప్రారంభమైందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.ఉద్యోగస్తులు కీలక పాత్రపోషించే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో 90 శాతం లాభం ఉంటుంది. వృత్తి పరంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా సుఖ సంతోషాలు నెలకొంటాయి.
కుంభ రాశి : గజకేసరి యోగం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గురుడి అనుగ్రహం వలన అనుకున్న పనులను త్వరగా పూర్తి చేసుకుంటారు.సమాజంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. వీరు చేపట్టిన పనుల్లో 92 శాతంలో అభివృద్ది ఉంటుంది. ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. జాబ్ మారాలనుకునే వారికి ఈ సమయం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి.అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థికంగా.. ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
