రాజమండ్రిలో గేమ్​ చేంజర్ మూవీ​ మినీ షెడ్యూల్‌‌‌‌

రాజమండ్రిలో గేమ్​ చేంజర్ మూవీ​ మినీ షెడ్యూల్‌‌‌‌

రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దాదాపు తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మినీ షెడ్యూల్‌‌‌‌ను సోమవారం నుంచి రాజమండ్రిలో ప్రారంభించనున్నారు.  ఈ షెడ్యూల్‌‌‌‌లో రామ్ చరణ్‌‌‌‌తో పాటు ఇతర నటీనటులు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు బ్యాలెన్స్ షూటింగ్‌‌‌‌ను పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

అయితే పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌కు ఎక్కువ సమయం అవసరం ఉండటంతో ఈ ఏడాది చివర్లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  కియారా అద్వాని హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ఎస్‌‌‌‌.జె.సూర్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.