
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. సరిగ్గా 75 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఆదివారం రామ్ చరణ్ సరికొత్త పోస్టర్‌తో అప్‌డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో చరణ్ వెనుక నుంచి కనిపిస్తున్నాడు.
సూట్ వేసుకుని ఐఏఎస్ అధికారి హోదాలో కూర్చిలో ఉండగా, ఎదురునుంచి కొందరు కత్తులతో పరుగెత్తుకుని రావడం ఆసక్తిని పెంచుతోంది. ఇక అతి త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.