Gandeevadhari Arjuna Pre Teaser: టైటిల్ ఒక్కటే క్లాస్.. విజువల్స్ హాలీవుడ్ రేంజ్

Gandeevadhari Arjuna Pre Teaser: టైటిల్ ఒక్కటే క్లాస్.. విజువల్స్ హాలీవుడ్ రేంజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి తాజాగా ప్రీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. 

ఈ ప్రీ టీజర్ లో ఒక్కో సీన్స్ అండ్ ఒక్కో షాట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ సీన్స్ కు తగ్గట్టుగా మిక్కీ జే మేయర్(Micky j mayer) ఇచ్చిన బ్యాక్గ్రౌంగ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ ఉంది. ఇక త్వరలోనే ఫుల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఇక ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్(SVCC) పై బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. సాక్షి వైద్య(Sakshi vaidya) హీరోయిన్ గా నటిస్తోంది. గని సినిమాతో వరుణ్, ఘోస్ట్ సినిమాతో ప్రవీణ్ సత్తారు.. ఫ్లాప్స్ తో ఉన్నారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా చాలా స్పెషల్. అందుకే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు దర్శకుడు, హీరో. మరి ఈ సినిమా ఈ ఇద్దరికీ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి మరి.