
న్యూఢిల్లీ: భారతీయ స్టాక్ మార్కెట్లలోకి ఇటీవలే ప్రవేశించిన గంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 11.3శాతం తగ్గింది. వైట్ ఆయిల్స్ తయారు చేసే ఈ కంపెనీ రూ. 48.1 కోట్ల నికరలాభం సాధించింది. ఇది గత క్వార్టర్లో రూ.54.2 కోట్లు ఉంది. తాజా క్వార్టర్లో కంపెనీ ఆదాయం దాదాపు 6.5శాతం క్షీణించి రూ.1,000.9 కోట్లకు చేరుకుంది.
ఇబిటా మార్జిన్లు సీక్వెన్షియల్ ప్రాతిపదికన 7.86శాతం నుంచి 7.59శాతంకి తగ్గాయి. ముడిసరుకు ఖర్చుల వల్ల మార్జిన్లు తగ్గి ఉంటాయని భావిస్తున్నారు. కంపెనీకి రెండవ క్వార్టర్ చివరి నాటికి 321.2 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ఇది 147.2 కోట్ల రూపాయల నుంచి పెరిగింది.