స్క్రాప్ దవాఖాన!.. గాంధీ ఆస్పత్రిలో పేరుకుపోయిన పాత ఇనుము

స్క్రాప్ దవాఖాన!.. గాంధీ ఆస్పత్రిలో పేరుకుపోయిన పాత ఇనుము

సికింద్రాబాద్ గాంధీ దవాఖాన ఆవరణలో ఇనుప స్క్రాప్ కుప్పలుగా పేరుకుపోయింది. మెయిన్ బిల్డింగ్ సెల్లార్ తో పాటు భవనం వెనకవైపు కుప్పలుగా పడి ఉన్న స్క్రాప్, కర్ర టేబుల్స్, పాత టైర్లు, కేబుల్స్, కుర్చీలు ఏండ్ల తరబడిగా పడి ఉంటోంది. ఇనుప స్క్రాప్ తో పాటు ఉడెన్​టేబుల్స్, కుర్చీలు, ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉండడంతో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదముందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ర్కాప్ లో పడేసిన కొన్ని బెడ్స్, టేబుల్స్, కుర్చీలు కొద్దిగా రిపేర్లు చేయిస్తే తిరిగి వాడుకునే అవకాశం ఉన్నా దవాఖాన అధికారులు పట్టించుకోవడం లేదు. -