గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్​ సిబ్బంది ధర్నా

గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్​ సిబ్బంది ధర్నా
  • ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్

పద్మారావునగర్, వెలుగు: మూడు నెలలుగా జీతాలు రావడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా శాలరీలు పెంచాలని గాంధీ ఆస్పత్రి కాంట్రాక్ట్  సిబ్బంది డిమాండ్ ​చేశారు. దేశవ్యాప్త సమ్మె లో భాగంగా రెండోరోజు మంగళవారం మెడికల్ ఎంప్లాయీస్​యూనియన్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా పేషెంట్​కేర్, శానిటేషన్​ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కార్మికుల హక్కుల సాధనకు పోరాడుతామన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని , లేదంటే ఆందోళన ఆపమని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్​ నాయకులు పుల్లయ్య, అమర్​ సింగ్​, సిబ్బంది పాల్గొన్నారు.