మానసిక ఆనందంతోనే ఆరోగ్యం: ప్రొఫెసర్ రాజారావు

మానసిక ఆనందంతోనే ఆరోగ్యం: ప్రొఫెసర్ రాజారావు

పద్మారావునగర్, వెలుగు: మానసిక ఆనందంతోనే ఆరోగ్యంగా ఉంటామని.. డిప్రెషన్ సమస్యలుంటే డాక్టర్లను కలిసి తగిన ట్రీట్​మెంట్ తీసుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. మంగళవారం వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా గాంధీ మెయిన్ బిల్డింగ్ వద్ద సైకియాట్రి డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ స్టూడెంట్లకు ఫ్లాష్ మాబ్, ఓపెన్ మైక్ కార్యక్రమాలను నిర్వహించారు. పాటలు, డ్యాన్స్​లు, కవితలు, ప్రసంగాలతో మానసిక ఆరోగ్యంపై స్టూడెంట్లు అవగాహన కల్పించారు. 

అనంతరం గాంధీ సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ మానసిక సమస్యలతో డిప్రెషన్​కు గురై 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు.  సైకియాట్రి విభాగం హెచ్​వోడీ, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉమా శంకర్ మాట్లాడుతూ.. మానసిక సమస్యలున్నవారుఅవి తీవ్రంగా మారకముందే సంబంధిత డాక్టర్లను సంప్రదించి తగిన వైద్యాన్ని పొందాలని సూచించారు.

కార్యక్రమంలో గాంధీ హెచ్ వోడీలు డా. జార్జ్, డా. శ్రవణ్ కుమార్​, డా. కృష్ణమోహన్,  సైకియాట్రి విభాగం అసోసియేట్​ప్రొఫెసర్ అజయ్ కుమార్, పీజీ, ఎంబీబీఎస్​ స్టూడెంట్లు పాల్గొన్నారు.