హైదరాబాద్లో మెడికోల క్యాండిల్స్​ ర్యాలీ

హైదరాబాద్లో మెడికోల క్యాండిల్స్​ ర్యాలీ

పద్మారావునగర్/ బషీర్ బాగ్, వెలుగు : కోల్​కతాలో ట్రైనీ డాక్టర్​పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ సోమవారం రాత్రి గాంధీ మెడికల్​కాలేజీ ఆవరణలో జూనియర్​డాక్టర్ల అసోసియేషన్​ఆధ్వర్యంలో క్యాండిల్స్​ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.

లేనిపక్షంలో దేశంలోని జూడాలంతా కలిసి ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఉస్మానియా మెడికల్​కాలేజీ స్టూడెంట్లు సోమవారం రాత్రి క్యాండిల్స్​ర్యాలీ నిర్వహించారు. కోల్​కతా ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.