మాదాపూర్, వెలుగు: మాదాపూర్ శిల్పారామంలో గాంధీ శిల్ప్ బజార్(ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ మేళా) సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ శృతి పాటిల్, తెలంగాణ ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ కె.మధుకర్ బాబు ప్రారంభించారు. ఇందులో వివిధ రాష్ట్రాల హస్తకళలు, చేనేత కళాకారుల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మేళా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
