V6 News

తల్లి పాడె మోసిన ప్రధాని మోడీ

తల్లి పాడె మోసిన ప్రధాని మోడీ

గుజరాత్లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించిన మోడీ..తల్లి అంతిమయాత్రలో పాల్గొన్నారు. తల్లి పాడె మోశారు. తల్లి మృతదేహం చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి అంతిమ కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. వాహనంలో ఎక్కి కూర్చున్నారు. 

గాంధీనగర్‌లో హీరాబెన్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సెక్టార్ 30లోని సంస్కార్ ధామ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.