గండిపేట, వెలుగు: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు 13 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడ జీపీఆర్ ఆర్కిడ్ అపార్ట్‌మెంట్ 4వ అంతస్తులో శ్రీనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లారు. సాయంత్రం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 13 తులాల బంగారం కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
