గండిపేట, వెలుగు: అత్తాపూర్ పరిధిలో ఓ ఇంట్లో దొంగలు రూ.20 లక్షల సొత్తు ఎత్తుకుపోయారు. నౌ నెంబర్ జలాల్ బాబానగర్‌లో ఉండే ఫిరోజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా వచ్చిన దొంగలు ఇంటి ముందున్న కెమెరాలు పక్కకు కదిలించారు.
ఇంటి తాళాలు పగలగొట్టి అల్మారాలోని రూ.8 లక్షల నగదు, 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఫిరోజ్ తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూసే సరికి చోరీ జరిగిందని తెలిసింది. ఫిరోజ్కదలికలను గుర్తించిన దొంగలు స్కెచ్ ప్రకారమే చోరీ చేసినట్టు తెలుస్తున్నది. బైకులపై వచ్చిన ఐదుగురు దొంగలు ఈ చోరీ చేసినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ టీమ్స్ఏర్పాటు చేశారు.
