జగిత్యాల జిల్లాలో వింత సంఘటన

జగిత్యాల జిల్లాలో వింత సంఘటన

జగిత్యాల జిల్లాలో వింత సంఘటన జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో గణనాథున్ని ప్రతిష్ఠించిన రోజే నిమజ్జనం చేశారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా పురాణాపూల్ దోబివాడ కాలనీలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే గణేష్ మండపానికి ఎదురింట్లో ఉండే లింగయ్య(60) అనే వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతి చెందాడు.

దీంతో చనిపోయిన వారి ఇంటి ముందు పండుగ చేయడం మంచిది కాదని పండితుల సూచించారు. ఈ మేరకు మృతదేహం ఇంటికి తేవడానికి వీలుగా.. ప్రతిష్ఠించిన రోజునే స్థానికులు వినాయకున్ని నిమజ్జనం చేశారు. నిమజ్జనం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహం ఇంటికి తరలించారు.