
తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. గంగమ్మ ఒడికి గణనాతులు క్యూ కట్టాయి. జై గణేశా..బైబై గణేశా అంటూ నినాదాలతో పల్లెలు, పట్టణాలు మార్మోగుతున్నాయి. గణనాథుడికి బైబై చెప్పేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. డప్పుచప్పుళ్లు, కోలాట నృత్యాలు, డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు. నిమజ్జన ర్యాలీల్లో యూత్ స్టెప్పులు వేస్తున్నారు. చెరువులు, కుంటల వద్ద వాహనాలతో క్యూలో ఉంటూ గణనాథులను గంగమ్మ ఒడికి చేరుతున్నాయి.
వరంగల్ లో రెండో రోజు గణనాధుల నిమజ్జనం కొనసాగుతోంది. గణనాధుల నిమజ్జనం కోసం పోచమ్మ మైదానం నుంచి చిన్న వడ్డేపల్లి చెరువు వరకు బారులు తీరాయి గణనాథ విగ్రహాలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
నిర్మల్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 508 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 180 సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభయాత్రకొనసాగుతోంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగాకుండా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆద్వర్యంలో సుమారు 300 మంది పోలిసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా 2 డ్రోన్ కేమరాలు, 120 సీసీ కేమరాల ద్వారా నిఘా పెట్టారు జిల్లా ఎస్పీ. గణేష్ నిమజ్జన టేక్రియాల్ చేరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగాకుండా బారీగెట్లని,ఏర్పాట్లు చేసి భారీ క్రేన్ ల సహాయంతో గణేష్ లను నిమజ్జనం చేయిస్తున్నారు. చెరువు దగ్గర గజ ఈతగాళ్లని అందుబాటులో ఉంచారు అధికారులు
నిజమాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు వినాయక నిమజ్జనాలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ గణేష్ నిమజ్జనం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని వినాయక భావితో పాటు బాసర, ఉమ్మేడ గోదావరి, పలు చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి.జిల్లా వ్యాప్తంగా 200 సిసి కెమెరాలు, 1300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో సార్వ జనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 1.30 నిమిషాలకు శోభయాత్ర ప్రారంభం కానుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శోభాయాత్రలో పాల్గొననున్నారు. నిజామాబాద్ టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.