వావ్… చంద్రయాన్ గణపతి.. ఎక్కడ కొలువయ్యాడంటే..?

వావ్… చంద్రయాన్ గణపతి.. ఎక్కడ కొలువయ్యాడంటే..?

ఏకదంతుడిని అనేక రూపాల్లో కొలుస్తుంటారు భక్తులు. ఎప్పటిలాగే ఈసారి కూడా బహు రూపాల్లో వినాయకుడిని నవరాత్రుల్లో పూజిస్తున్నారు. దేశమంతటా అనేక రూపాల్లో దర్శనమిస్తూ అభయమిస్తున్నాడు గణపతి. ఇస్రో పంపిన చంద్రయాన్2 ఉపగ్రహం స్ఫూర్తితోనూ శాటిలైట్ గణేశ్ ను ఏర్పాటుచేసి భక్తులను విశేషంగా ఆకర్శిస్తున్నారు హైదరాబాద్ లోని ఓ గణేశ్ మండప నిర్వాహకులు.

చంద్రయాన్ 2 ను చంద్రుడిపైకి పంపిన జీఎస్ఎల్వీ మార్క్ 3 డీ2 శాటిలైట్ నమూనాపై గణపతిని విగ్రహాన్ని ఏర్పాటుచేశారు నిర్వాహకులు. శాటిలైట్ ఎత్తు 23.5 ఫీట్లు. దానిపై.. చంద్రయాన్ 2 స్థానంలో ఐదు ఫీట్ల ఎత్తున్న గణపతిని ఉంచారు. దాని చుట్టూ.. అంతరిక్షం వాతావరణం ఉట్టిపడేలా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.