హైదరాబాద్ ఓల్డ్ సిటీ మరోసారి గ్యాంగ్ వార్ లతో గజగజ వణికిపోయింది. శుక్రవారం (నవంబర్ 21) అర్థరాత్రి ఆసిఫ్‌నగర్ PS పరిధి మురాద్‌నగర్ చోటి మస్జిద్ దగ్గర గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. ఒక గ్యాంగ్ మందలు మందులుగా వెళ్లి యువకులపై చేసిన దాడి పాతబస్తీని కునుకు లేకుండా చేసింది.
టిప్పు అలియాస్ టిప్పు షేర్, షబ్బీర్, ఖలీల్, అప్పు అనే యువకుల గ్యాంగ్ దాడి ఓల్డ్ సిటీలో భయాందోళనలకు గురిచేసింది. గ్యాంగ్ ఒక్కసారిగా మందగా.. వందల సంఖ్యలో పరుగులు పెడుతూ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఏదో మారథాన్ కు వెళ్తున్నారా అన్నట్లుగా కర్రలతో పరుగులు తీశారు.
యువకులను కర్రలతో వెంటాడి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఓల్డ్ సిటీ మొత్తం కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై ఆసిఫ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
