
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ జన సమితికి గంగాపురం వెంకటరెడ్డి రిజైన్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన, పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాంకు రాజీనామా లెటర్ అందజేశారు. పార్టీ విధానపరమైన నిర్ణయాలతో విభేదించి రాజీనామా చేస్తున్నట్లు వెంకటరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. తనకు సహకారాన్ని అందించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు కు చెందిన వెంకటరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కజిన్ బ్రదర్ అవుతారు.