కోల్‌కతా: పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించే అంశంపై బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. దాయాదుల సమరానికి ఇరుదేశాల ప్రధానుల అనుమతి తప్పక అవసరమని కుండబద్దలు కొట్టాడు. ‘పాక్‌తో సిరీస్ అంశాన్ని ప్రధాని మోడీజీ, ఇమ్రాన్‌ను అడగండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ టూర్లన్నీ ప్రభుత్వ అనుమతితోనే జరుగుతాయి.
అందుకే మీరు (మీడియా) అడిగిన ప్రశ్నలకు మా వద్ద సమాధానం లేదు’ అని దాదా స్పష్టం చేశాడు. మరోవైపు ఆదివారం కేరళలో జరుగనున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఓపెనింగ్ సెర్మనీకి దాదా హాజరుకానున్నాడు. దాంతో, రాంచీలో శనివారం మొదలయ్యే మూడో టెస్ట్‌కు గంగూలీ రాలేకపోతున్నాడు.

