IND AFG 1st ODI: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘన్ తడబడింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ 13 పరుగుల దగ్గర డెబ్యూ బౌలర్ గుర్నూర్ బ్రార్ వేసిన ఓ అద్భుతమైన బంతిని భారీ షాట్ ఆడబోయి మిడాఫ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి ఇబ్రహీం జద్రాన్ (1) పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సెడిఖుల్లా అటల్ కూడా ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు.
టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన కిరాక్ బంతికి సెడిఖుల్లా అటల్ ఎల్బీడబ్ల్యూ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో 16 పరుగులకే రెండో వికెట్ ని ఆఫ్ఘనిస్తాన్ నష్టపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహ్మత్ షా కూడా ఇలా వచ్చి అలా మైదానం నుంచి నిష్ర్కమించాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్ లోనే హర్ష్ దూబేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. దీంతో 26 రన్స్ కే ఆఫ్ఘన్ కీలకమైన మూడో వికెట్ ని కోల్పోయింది.
►ALSO READ | టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. 25 ఓవర్లే మ్యాచ్
మరో ఎండ్ లో ఉన్న ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తున్నాడు. వచ్చిన బంతిని బౌండరీకి తరలిస్తూ, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 9వ ఓవర్లలో వరుసగా రెండు ఫోర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక హష్మతుల్లా షాహిది (15 )సైతం గుర్బాజ్ కి సహకారం అందిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆఫ్ఘన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.
