హైదరాబాద్ గంధంగూడ డీమార్ట్ దగ్గర రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

హైదరాబాద్ గంధంగూడ డీమార్ట్ దగ్గర రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
  • మహిళలతో అసభ్య ప్రవర్తన
  • ఐదుగురికి దేహశుద్ది.. పోలీసులకు అప్పగింత

గండిపేట, వెలుగు: హైదరాబాద్‌‌కు సమీపంలోని గండిపేట పరిధిలోని గంధంగూడ డీమార్ట్ ​దగ్గర గంజాయి  బ్యాచ్​రెచ్చిపోయింది. బుధవారం రాత్రి డీమార్ట్​కు వెళ్లే మెయిన్​రోడ్డులో ఐదుగురు మైనర్లు గంజాయి మత్తులో వచ్చిపోయే వాహనాలపై, స్థానికులపై దాడులకు తెగబడ్డారు. కనిపించిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టుకుంటూ పోయారు. దీంతో స్థానికులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి, నార్సింగి పోలీసులకు అప్పగించారు. 

స్థానికులు మాట్లాడుతూ ప్రతిరోజూ డీమార్ట్ చుట్టుపక్కల ప్రాంతంలో గంజాయి తాగుతున్న యువకులు గొడవలు చేస్తున్నారని, వీరి తీరుతో మహిళలు, పిల్లలు భయంతో బయటకు రాలేకపోతున్నారన్నారు. పోలీసులు మైనర్లపై ఎన్‌‌డీపీఎస్ యాక్ట్​కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.