- 70 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒడిశాలో గంజాయి సాగు చేస్తూ హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరిని వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్‌చేశారు. అడిషనల్డీసీపీ ఎండీ.ఇక్బాల్తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన రైతు మనీల్ దలబెహరా గంజాయి సాగు చేస్తున్నాడు.
ఒడిశాకే చెందిన మరో వ్యక్తి ఇస్మాయిల్ రైతా హైదరాబాద్ మేడ్చల్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇస్మాయిల్ రైతా గంజాయి అమ్ముతుంటాడు. మనీల్ ఆర్థిక ఇబ్బందులతో తన భూమిలో గంజాయి సాగు చేస్తూ తన బంధువు రినితా రైతా సాయంతో దాన్ని హైదరాబాద్‌లో విక్రయించాలని ప్లాన్ చేశాడు.
ఇస్మాయిల్ రైతా ద్వారా ధూల్‌పేట్ వంటి ప్రాంతాల్లో అమ్ముతున్నాడు. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో బుధవారం దాడి చేసి, ఇద్దరినీ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 70 కిలోల ఎండు గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
