ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ టైటిల్ విజేత గార్సియా-క్రిస్టినా

ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ టైటిల్ విజేత గార్సియా-క్రిస్టినా

ఫ్రెంచ్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్ లోకల్ జోడి ఎగురేసుకుపోయింది. ఫైనల్‌లో కరోలిన్ గార్సియా, క్రిస్టినా ఫ్రెంచ్ జోడి.. డెనోవిక్ కోకో గాఫ్, జెస్సికా పెగులా (అమెరికా) జంటను 2-6, 6-3, 6-2 స్కోరు తేడాతో ఓడించింది.  గంటా 44 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో గార్సియా- క్రిస్టినా జంట ఫస్ట్ సెట్ను కోల్పోయింది. కేవలం రెండు గేముల్లో గెలిచిన ఫ్రెంచ్ టీమ్..6 గేముల్లో ఓడిపోయింది. అయితే రెండు మూడో సెట్లలో అనూహ్యంగా పుంజుకుంది. భీకరమైన ర్యాలీలు చేస్తూ ప్రత్యర్థులను పరిగెత్తించారు. అద్భుతమైన సర్వీసులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇదే క్రమంలో సెకండ్ సెట్ను 6-3తో గెలుచుకుని మ్యాచ్ను సమం చేశారు. నిర్ణయాత్మక మూడో సెట్లో మరింతగా చెలరేగారు గార్సియా, క్రిస్టినా. చివరకు 6-2 స్కోరుతో సెట్తో పాటు మ్యాచును సొంతం చేసుకున్నారు. గార్సియా, క్రిస్టినా జంటకు ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్. 2016లోనూ ఈ జోడి విజేతగా నిలవడం విశేషం.

మరిన్ని వార్తల కోసం..

ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ విజేత అరెవాలో, రోజర్ జోడీ

విరాటపర్వం ట్రైలర్ అదుర్స్