
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(జీఆర్ఎస్ఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 04.
పోస్టులు: 55 ( జర్నీమ్యాన్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదో తరగతి, ఎన్ఏసీ/ ఎన్ టీసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 2025, జులై 1 నాటికి 26 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 05.
లాస్ట్ డేట్: ఆగస్టు 04.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, పీఈటీ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.