రాఖీకి గ్యాస్.. దివాళీకి పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా

రాఖీకి గ్యాస్.. దివాళీకి పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా

రాఖీ పండుగ గిఫ్ట్ గా దేశ మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన కేంద్రం.. డిసెంబర్ లో కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు, దీపావళీ  నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. లీటర్ కు 3 నుంచి 5 రూపాయల తగ్గించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. దీనికి జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ నివేదకలు అవుననే అంటున్నాయి. 

ALSO READ : సనాతన ధర్మం ఎయిడ్స్, కుష్టు వ్యాధి లాంటిది: దేనికైనా రెడీ అంటున్న రాజా

 2023 ఆగస్టు 30 నాటికి330 మిలియన్ల వినియోగదారులకు  కేంద్ర ప్రభుత్వం 14.2కేజీల ఎల్ పీజీ సిలిండర్ పై రూ. 200 తగ్గించడంలో ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం కలిగింది.  ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఈ LPG ధర తగ్గింపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.