తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర

తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర

న్యూఢిల్లీ: కమర్షియల్ సిలిండర్ వినియోగించే వారికి ఊరట కలిగిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.115.50 మేర తగ్గించాయి. కొత్త ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే 14.2 కిలోల వంటింటి సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 

ఢిల్లీలో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ.1859 ఉండగా.. తాజా తగ్గింపుతో రూ.1744కి తగ్గింది. అలాగే ముంబయిలో రూ.1811 నుంచి రూ.1696కు తగ్గింది. సామాన్యుల వంటింటి సిలిండర్ (14.2కిలోలు) గత జులై నుంచి స్థిరంగా ఉండగా.. కమర్షియల్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది. గత అక్టోబర్ 1న కమర్షియల్ సిలిండర్ ధర రూ.25 తగ్గగా..  14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడంతో హోటళ్లు, చిరు తిండ్లు అమ్ముకునే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులకు ఊరట కలిగించింది.