డివైడర్ ను ఢీకొని గ్యాస్ ట్యాంకర్ బోల్తా…

డివైడర్ ను ఢీకొని గ్యాస్ ట్యాంకర్ బోల్తా…

డివైడర్ ను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ఘటన సోమవారం పొద్దున హైదరాబాద్, శంషాబాద్ వద్ద జరిగింది. గ్యాస్ ట్యాంకర్ నిండుగా ఉండటంతో ఎక్కడ పేలిపోతుందో అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తున్న గ్యాస్ ట్యాంకర్ శంషాబాద్ బుర్జుగడ్డ తాండావద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా కొట్టింది. ట్యాంకర్ లో నిండుగా గ్యాస్ ఉండడంతో ఎక్కడ గ్యాస్ పేలి ప్ర‌మాదం చోటుచేసుకుంటుందోనని వాహనదారులు భయపడ్డారు. రోడ్డుపైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.