ఆర్ట్స్ డిగ్రీలకూ గేట్ ఛాన్స్

ఆర్ట్స్ డిగ్రీలకూ గేట్ ఛాన్స్

బీఈ, బీటెక్, సైన్స్ స్టూడెంట్స్ పీహెచ్డీ అడ్మిషన్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీల్లో ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ గేట్–2021 షెడ్యూల్ విడుదలైంది. గతంలో ఇంజినీరింగ్, సైన్స్ స్టూడెంట్స్ కు మాత్రమే ఎలిజిబులిటీ ఉండే గేట్ ఎగ్జామ్‌‌‌‌కు ఈసారి ఆర్ట్స్‌ స్టూడెంట్స్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచి హ్యుమానిటీస్ అండ్‌ సోషల్‌‌‌‌ సైన్సెస్‌ చదివే స్టూడెంట్స్ గేట్ రాయవచ్చని ఐఐటీ ముంబయి కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఫిబ్రవరి 5,6,7,12,13,14 తేదీల్లో ఎగ్జామ్ నిర్వహించనుంది.

గేట్‌‌–2021కొత్త రూల్స్

గతంలో బీటెక్ ఫైనల్ ఇయర్, బీఎస్పీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు చాన్స్ ఉండేది. కానీ ఈసారి బీటెక్ థర్డ్ఇయర్ స్టూడెంట్స్ కు అవకాశం కల్పించారు. ఈసారి హ్యుమానిటీస్ ‌అండ్ ‌సోషల్‌‌‌‌ సైన్సెస్ చదివిన ఆర్ట్స్ స్టూడెంట్స్‌కు గేట్ అవకాశం కల్పించారు. ఇదివరకు 25 సబ్జెక్టులకు పరీక్షలుండగా, ఇప్పుడు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్అనే రెండు సబ్జెక్టులను చేర్చారు. ఒక స్టూడెంట్ ఒకే సబ్జెక్టులో ఎగ్జామ్ రాయాల్సి ఉండేది. కానీ గేట్–2021లో రెండు సబ్జెక్టులకు వెసులుబాటు కల్పించింది. కోవిడ్–19 కారణంతో విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ సంఖ్య తగ్గడంతో పాటు బీఏ స్టూడెంట్స్‌కు అవకాశం కల్పించడంతో అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే చాన్స్ఉంది. ఇందుకోసం ఈసారి గేట్ ప‌రీక్ష ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో నాలుగు రోజులు మాత్రమే నిర్వహించేవారు.

27 సబ్జెక్టుల వివరాలు

ఏరోస్పేస్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ర్టీ, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,ఎలక్రక్టిల్ ఇంజినీరింగ్, ఎకాలజీ ఇంజినీరింగ్, జియోలజీ అండ్ జియోఫిజిక్స్, ఇన్స్ట్రమెన్షన్ ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, మిటలార్జియల్ఇం జినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్అండ్ ఇండస్ర్టియల్ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్, టెక్స్ టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.

ఎగ్జామ్ సెంటర్ జోన్లు

బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్‌, ఖరగ్‌‌పూర్‌, మద్రాస్‌‌, రూర్కీ
వెబ్‌‌సైట్‌‌: https://gate.iitb.ac.in

మ‌రిన్ని వార్త‌ల కోసం..