
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత గట్టు రామచందర్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. " మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యానని" లేఖలో గట్టు తెలిపారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు గట్టు రామచందర్ రావు .