హైదరాబాద్, వెలుగు: కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ చైర్మన్‌గా ‘రీ సస్టయినబిలిటీ లిమిటెడ్’ వైస్– చైర్మన్ గౌతమ్ రెడ్డి (2026--–27 సంవత్సరానికి) ఎన్నికయ్యారు. సిగ్నోడ్ గ్రూప్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ గౌరవ్ మహేశ్వరి వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. గౌతమ్ రెడ్డికి పర్యావరణ సేవలు, వ్యర్థాల నిర్వహణలో 27 ఏళ్ల అనుభవం ఉంది. మొదట ఈటీఆర్‌ఐలో పర్యావరణ శాస్త్రవేత్తగా పని చేసిన ఆయన, ఆ తర్వాత రామ్‌కీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్‌లో చేరారు. ప్రస్తుతం రీ సస్టయినబిలిటీగా పేరు మారిన ఈ కంపెనీకి, 23 రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో 85 పైగా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి.
