జర్మనీ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో గాయత్రి జోడీ

జర్మనీ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో గాయత్రి జోడీ

రూర్‌‌‌‌‌‌‌‌: ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు పుల్లెల గాయత్రి–ట్రీసా జోలీ.. జర్మనీ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌ గాయత్రి–ట్రీసా 21–10, 21–11తో సోనా హోరింకోవా–కెటరినా జుజకోవా (చెక్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీతో చెలరేగిన ఇండియా ద్వయం 28 నిమిషాల్లోనే ప్రత్యర్థులకు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. 

తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో 5–5తో స్కోరు సమమైన తర్వాత గాయత్రి జంట వెనుదిరిగి చూసుకోలేదు. వరుస పాయింట్లతో హోరెత్తించింది. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌ కూడా ఇలాగే జరిగింది. 5–5 తర్వాత గాయత్రి–ట్రీసా వరుసగా 4, 6, 3, 3 పాయింట్లు సాధించారు. మధ్యలో చెక్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఒకటి, రెండు పాయింట్లకే పరిమితమయ్యారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ఆకర్షి కశ్యప్‌‌‌‌‌‌‌‌ 13–21, 14–21తో మియా బ్లిచ్‌‌‌‌‌‌‌‌ఫెల్డ్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడింది.