నిజమాబాద్ రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి రియాక్షన్..

నిజమాబాద్ రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి రియాక్షన్..

నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు నిందితుడు రియాజ్ ను సోమవారం ( అక్టోబర్ 20 ) ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. రియాజ్ ఎన్ కౌంటర్ కి సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. నిందితుడు రియాజ్ తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి తెగబడ్డాడని తెలిపారు. రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసారని.. పోలీసుల దగ్గరున్న వెపన్ తీసుకొని కాల్పులకి ప్రయత్నించాడని తెలిపారు. 

మరోసారి కాల్పులు జరపడంతో పోలీసుల ఎదురుకాల్పుల్లో రియాజ్ మరణించినట్లు తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఆదివారం రియాజ్ ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడని.. ఇవాళ మరొక కానిస్టేబుల్ ని గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు డీజీపీ. రియాజ్ బాత్ రూమ్ కోసం వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడ్డాడని తెలిపారు డీజీపీ.పోలీసుల దగ్గరున్న వెపన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడని.. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో రియాజ్ మరణించారని తెలిపారు డీజీపీ.

ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ నుంచి రియాజ్‌ గన్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయాడు. అక్టోబర్ 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపాడు. నిజామాబాద్‌‌లో సీసీఎస్‌‌ కానిస్టేబుల్‌‌ ప్రమోద్‌‌ కుమార్‌‌ను హత్య చేసిన రియాజ్‌‌ అరబ్‌‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్‌‌ చేసిన సంగతి తెలిసిందే. నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

కానిస్టేబుల్‌‌ చంపి పారిపోయిన రియాజ్ ను పట్టుకునేందుకు స్పెషల్‌‌ టీమ్స్‌‌ను ఏర్పాటు చేయడంతో వారు ఎక్కడికక్కడ గాలింపు ముమ్మరం చేశారు. నిజామాబాద్‌‌ శివారులోని బాబన్‌‌సాబ్‌‌ పహాడ్‌‌, సారంగాపూర్‌‌ ఏరియాలో రియాజ్‌‌ ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అటువైపు ఫోకస్‌‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రియాజ్‌‌ శనివారం రాత్రి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని నగర శివారులోని ఓ రియల్‌‌ ఎస్టేట్‌‌ వెంచర్‌‌కు సమీపంలో ఉన్న పాత లారీ క్యాబిన్‌‌లో దాక్కున్నాడు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు అటువైపు వెళ్లారు.

పోలీసుల వస్తున్నట్లు గమనించిన రియాజ్‌‌ పారిపోయేందుకు ప్రయత్నించగా.. దగ్గర్లోనే ఉన్న బైక్‌‌ మెకానిక్‌‌ ఆసిఫ్‌‌ పట్టుకున్నాడు. దీంతో రియాజ్‌‌ కత్తితో ఆసిఫ్‌‌ను గాయపర్చాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో రియాజ్‌‌కు సైతం గాయాలు అయ్యాయి. ఇదే టైంలో అక్కడుకు చేరుకున్న పోలీసులు రియాజ్‌‌ను అదుపులోకి తీసుకొని ట్రీట్‌‌మెంట్‌‌ కోసం తమ వాహనంలో జీజీహెచ్‌‌కు తరలించారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా సాయుధ పోలీసులను నియమించారు.

రియాజ్‌‌ను పట్టుకోబోయి గాయపడిన ఆసిఫ్‌‌కు ట్రీట్‌‌మెంట్‌‌ ఇప్పించి పంపించారు. తనను ఎన్‌‌కౌంటర్‌‌ చేస్తారని ప్రచారం జరగడంతో.. తాను ఉన్న ప్రతీ ప్లేస్‌‌కు కొద్దిదూరంలో తన గ్యాంగ్‌‌లోని ఓ సభ్యుడిని పెట్టి పోలీసులు తనను పట్టుకోగానే వీడియో తీసి వైరల్‌‌ చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే రియాజ్‌‌ పట్టుబడినట్లు ఓ వీడియో వైరల్‌‌ అయింది. సోమవారం చికిత్స పొందుతూ రియాజ్ మృతి చెందాడు.